Home / Genres / Children's Books / Tatayya Kala - Balala Bommala Kathalu
తాతయ్య కల - బాలల బొమ్మల కథలు
Kasi Mavayya
తాతయ్య కల - బాలల బొమ్మల కథలు
by Kasi Mavayya · Telugu
ఉమ్మడి కుటుంబాల్లో తాతయ్యలు, అమ్మమ్మలు చెప్పే కథలు పిల్లల ఆలోచనా శక్తిని, కల్పనాశక్తిని పెంచి వారి వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదపడతాయి. నేటి ఉరుకుల పరుగుల జీవనంలో ఆ లోటును భర్తీ చేస్తూ ప్రముఖ బాలసాహితీవేత్త శ్రీ కాశీ విశ్వనాథం పట్రాయుడు గారు రచించిన అద్భుతమైన బాలల కథా సంపుటి "తాతయ్య కల".
ఈ పుస్తకంలో పిల్లలను ఆకట్టుకునే 30 నీతి కథలు ఉన్నాయి. ఆప్యాయతానురాగాలను చాటిచెప్పే 'పేగు బంధం', పట్టుదలను నేర్పే 'ఎలుగుబంటి కధ', సమైక్యతను వివరించే 'ఎవరు గొప్ప', మాతృభాష ప్రాధాన్యతను తెలిపే 'తియ్యనైన తెలుగు', సహజీవనం-వృద్ధుల ఆదరణను హృద్యంగా చిత్రించిన 'తాతయ్య కల' వంటి కథలు పిల్లల్లో మానవతా విలువలను, సత్ప్రవర్తనను పెంపొందిస్తాయి.
సరళమైన శైలి, అలతి పదాలు, ప్రముఖ కార్టూనిస్ట్ ప్రేమ్ గారు వేసిన ఆకర్షణీయమైన చిత్రాలతో రూపొందిన ఈ కథల పుస్తకం బాలల పఠనాసక్తిని పెంచే అమూల్యమైన కానుక!