Home / Genres / Poetry / Suphala - Phala Padhya Manjari
సుఫల - ఫల పద్య మంజరి
Ratna Manjari
సుఫల - ఫల పద్య మంజరి
by Ratna Manjari · Telugu
ఆరోగ్యమే మహాభాగ్యం. మన దైనందిన జీవితంలో పండ్లు, ఫలాలు ఆరోగ్య పరిరక్షణకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో తోడ్పడతాయి. ప్రకృతి మనకందించిన ఈ సహజ సిద్ధమైన ఔషధ ప్రసాదాలను శతక పద్య రీతిలో వర్ణిస్తూ ప్రముఖ రచయిత్రి శ్రీమతి నాగమంజరి గుమ్మా గారు రచించిన అద్భుతమైన పద్య సంపుటి "సుఫల - ఫల పద్య మంజరి".
ఈ పుస్తకంలో మనదేశంలో లభించే అరటి, మామిడి, ఉసిరి, దానిమ్మ, నేరేడు, జామ వంటి సాంప్రదాయ ఫలాలతో పాటు డ్రాగన్ ఫ్రూట్, కివి, అవకాడో, రాంబుతాన్ వంటి వివిధ రకాల విదేశీ ఫలాలతో కలిపి మొత్తం 108 ఫలాల విశేషాలను పద్య రూపంలో పొందుపరిచారు. ప్రతి పద్యంతో పాటు ఆయా పండ్ల విశేషాలు, వాటిలోని విటమిన్లు, పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాలను వివరించే తాత్పర్యం అందించడం ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత.
పిల్లలకు భాషపై మమకారాన్ని, పద్య సాహిత్యం పట్ల అభిరుచిని పెంచడంతో పాటు వివిధ రకాల ఫలాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేసే ఈ గ్రంథం ప్రతి ఒక్కరి ఇంట ఉండదగిన విశిష్టమైన పుస్తకం!